telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు… విశాఖ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటాం

బీజేపీ పార్టీపై మరోసారి మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ వస్తే.. కరెంట్ ఉండదు అన్నారు.. చీకటి రోజులే అన్నారు.. తెలంగాణ వచ్చాక రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్, ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని.. 65 ఏళ్లలో కాని పనులు.. 6 ఏళ్లలో చేసి చూపించామని గుర్తుచేశారు. పెట్టుబడులే రావు అన్న తెలంగాణకి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వాణీదేవి ప్రశ్నించే గొంతు కాదు.. పరిష్కరించే గొంతు అవుతారని తెలిపారు. ఉత్తమ్ కుమార్.. రోజూ మాపై ఆరోపణలు చేస్తుంటారని… మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో లెక్కలు చూపాలని సవాల్ విసిరారు. సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇదే మోడీ… మన్మోహన్ సింగ్ పై దుమ్మెత్తి పోశారని…మరి ఇప్పుడు ధరలు రెట్టింపు అయ్యాయని, ఇప్పుడు ఎవరిని అనాలని చురకలు అంటించారు. ఏమైనా అంటే… దేశం కోసం ధర్మం కోసం అంటారని.. పొద్దున లేస్తే… మతం కులం అంటారని ఫైర్‌ అయ్యారు కేటీఆర్. విశాఖ హక్కు…ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేశారని… విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉందన్నారు. వీలైతే… వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామని..పోరాటంలో కలిసి ఉంటామని హామీ ఇచ్చారు.

Related posts