telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు కేటీఆర్ జన్మదినం… టీఆర్ఎస్ రక్తదాన శిబిరం

minister talasani trs

తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ రోజు ఆయనకు వివిధ రంగాలకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తమ యువనేత పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ శ్రేణులు నగరంలో పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో టీఆర్ఎస్ శ్రేణులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts