telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు: కేసీఆర్‌

తెలంగాణలోని దళితులు ఆర్థిక సుస్థిరత సాధించడమే దళిత బంధు ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పురాపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతమ్‌ డీమ్డ్‌ వర్సిటీలో పబ్లిక్ పాలసీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో కేటీఆర్‌ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. వారికిచ్చే రూ.10 లక్షలను ఎలా ఖర్చు చేస్తున్నారు.. ఎందుకు ఖర్చు చేస్తున్నారనేది అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారన్నారు. ఆ రూ.10 లక్షల మొత్తంతో వ్యాపారాలు ప్రారంభించడానికి, వాటిని పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించేందుకు ఉపయోగపడేలా అధికారులు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం ప్రారంభం తర్వాత మైనారిటీ బంధు, బీసీ బంధు లాంటి డిమాండ్లు వస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా ఏ గణాంకాలు చూసినా దళితులు అట్టడుగున ఉంటున్నారని.. వారు సాధికారత సాధించేలా ముందుగా వారికి ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు.

‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద 62 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లు ఇస్తున్నాం. రైతు బంధు వచ్చాక రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయి. ఇప్పుడు దేశంలోని 11 రాష్ట్రాలు రైతు బంధును అమలు చేస్తున్నాయి. గతంలో వ్యవసాయం వర్షాలు, బోర్లమీద ఆధారపడి ఉండేదని.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంతో నీరు అందుతుందన్నారు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రమే ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఉంది. విభజన వల్ల రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్లు ఏమయ్యాయో తెలియదు. రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు. ఇప్పటివరకు 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు. నాన్నకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాను” అని కేటీఆర్‌ తెలిపారు.

Related posts