telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భలే ఛాన్స్‌ కొట్టేసిన ఉప్పెన భామ !

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయింది.  అయితే ఉప్పెన మూవీ బంపర్ హిట్ కావడంతో  కృతికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె నాని శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. అలాగే సుధీర్‌బాబు-మోహన్‌కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కూడా కథానాయికగా ఎంపికైంది. అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అయితే.. తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ భామ. హీరో రామ్‌కు జోడిగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి జోడి కట్టనున్నట్లు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. లింగుస్వామి డైరెక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతిశెట్టిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుండగా.. కృతిశెట్టి ఈ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే హీరోయిన్‌ ఎంపికపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related posts