telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

11 వసంతాలు పూర్తిచేసుకున్న .. కృషపట్నం.. పోర్టు..

krishnapatnam port 11th aniversary

ఏపీలోని కృష్ణపట్నం పోర్టును జాతికి అంకితమిచ్చి నేటికి సరిగ్గా పదకొండేళ్లు. ఈ 11 ఏళ్లలో పోర్టు ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. దక్షిణాసియాలోనే అత్యుత్తమ సాంకేతిక పోర్టుగా రికార్డులకెక్కింది. దేశంలోనే డీపెస్ట్ వాటర్ పోర్టుగా ఖ్యాతిగాంచిన కృష్ణపట్నంలో అతిపెద్ద నౌకల నిర్వహణకు అనువుగా 16 బెర్తులు ఉన్నాయి. అంతేకాక 15 మిలియన్ టన్నుల కార్గోను నిల్వచేసేందుకు వీలుగా 11 పెద్దపెద్ద గోదాములు ఉన్నాయి. పోర్టును పూర్తిస్థాయి కంటైనర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు నవయుగ సంస్థ కృషి చేస్తోంది.

42 బెర్తులతో అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన పోర్టుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కృష్ణపట్నం-ఓబులవారి పల్లె రైల్వే లైను నిర్మాణం కూడా ఇటీవలే పూర్తయింది. ఈ మార్గం గుండా ఇప్పటికే సరుకుల రవాణాను కూడా ప్రారంభించారు. కృష్ణపట్నం పోర్టును దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు గేట్‌వేగా తీర్చిదిద్దేందుకు పోర్టు యాజమాన్యం కృషి చేస్తోంది.

Related posts