telugu navyamedia
telugu cinema news trending

ప్రభుదేవా ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’ .. టీజర్ ..

krishnamanohar ips movie teaser

నటుడు, దర్శకుడిగా ప్రభుదేవా పలు బాషలలో తన సత్తా చాటుతున్నాడు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా పలు హిట్ చిత్రాలు అందించారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటూ నటనవైపు దృష్టి పెట్టాడు. అప్పుడప్పుడు నిర్మాణం వైపు దృష్టి పెడుతూనే నటుడిగా బిజీ అవుతున్నాడు. తాజాగా తమిళంలో ఆయన చేసిన చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’ పేరుతో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో ప్రభుదేవా ఓ పవర్ ఫుల్ ఐపీఎస్ గా నటించారు. ఆయన సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ రీలీజ్ చేశారు. తాను నమ్మిన సిద్దాంతం కరెక్ట్ అని తెలిసే వెనుకా ముందు ఆలోచించకుండా కఠినంగా శిక్షించే ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభుదేవా కనిపిస్తున్నాడు. ‘పొలిటికల్ ఇన్ ఫ్లూలేన్స్ నేను చూసుకుంటాను..మన డిపార్ట్ మెంట్ నుంచి నాకు ఎలాంటి డిస్టబెన్స్ ఉండకూడదు.. నాకు తోచిందే నేను చేస్తాను సార్ ‘ అంటూ టిజర్ ఎండింగ్ లో డైలాగ్ చూస్తుంటే ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.

ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Related posts

ఈ రోజు మీ రాశి ఫలితాలు .. ఏమంటున్నాయంటే..

vimala p

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p

ఓ ప్రియా . . . ! 

vimala p