telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్ పెళ్ళి… స్పందించిన కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి

Prabhas

ఈరోజు “మహిళా దినోత్సవం” సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. “ప్రభాస్ పెళ్ళి గురించి ఇంతవరకూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ వార్తలను మేము సరదాగా తీసుకుంటాము. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. మాది చాలా పెద్ద కుటుంబం… అంతా ఆప్యాయంగా ఉంటాము. మా పెద్ద కుటుంబంతో కలిసిపోయే అమ్మాయే ప్రభాస్ కు భార్యగా రావాలని మేమంతా కోరుకుంటున్నాము. ప్రభాస్ పెళ్ళి గురించి మేము కూడా ఎదురు చూస్తున్నాము” అంటూ చెప్పుకొచ్చారు శ్యామలాదేవి.

కొన్నాళ్ల క్రితం ప్రభాస్ పెళ్ళి గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక పేరు కూడా ఆ జాబితాలో ఉంది. ఇక ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ కథనాలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. కానీ వాళ్లిద్దరూ ఆ వార్తలను కొట్టిపారేశారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.

Related posts