telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … ముగిసిన.. నీటి పంపిణి.. ఉత్తర్వులు జారీ ..

krishna water board meeting

ఏపీ, తెలంగాణకు నవంబరు వరకు తాగు-సాగునీటి అవసరాల కోసం నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వినియోగం, రెండు రాష్ట్రాల విజ్ఞప్తులు, ఇటీవల ఇంజినీర్లతో జరిగిన సమావేశం ఆధారంగా నీటివిడుదల ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 4 నుంచి నీటి వినియోగం కోసం రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది. కనీస నీటివినియోగ మట్టంపైన.. ప్రస్తుతం శ్రీశైలంలో 156.659, నాగార్జునసాగర్‌లో 179.181 టీఎంసీల చొప్పున రెండు జలాశయాల్లో కలిపి 335.840 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అన్నింటి ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 69.346 టీఎంసీలు, తెలంగాణకు 79 టీఎంసీల విడుదలకు అనుమతిచ్చింది.

ఏపీ అవసరాల కోసం పోతిరెడ్డిపాడు ద్వారా 3.03 టీఎంసీలు, హంద్రీనీవా-ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 9.743 టీఎంసీలు కేటాయించారు. సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా 5.529 టీఎంసీలు, కుడికాల్వ ద్వారా 42.554, కృష్ణాడెల్టా ద్వారా8.49 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతిచ్చింది. తెలంగాణ అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 15 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా 45 టీఎంసీల విడుదలకు అనుమతిచ్చింది. ఏఎమ్మార్పీ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకోసం 17 టీఎంసీలు, మిషన్‌ భగీరథకోసం రెండు టీఎంసీలు కేటాయించింది. కృష్ణా డెల్టా అవసరాల కోసం తొలుత పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆ తర్వాత సాగర్‌ నుంచి నీరు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది.

Related posts