telugu navyamedia
telugu cinema news trending

ఓటీటీలో వస్తున్న క్రాక్‌ మూవీ.. ఎప్పుడంటే !

సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది మాస్ మహరాజ క్రాక్ సినిమా. కరోనా కారణంగా ఆలస్యమై జనవరీ9న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు చేస్తూనే ఉంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసిందన్న విషయం పక్కా అయింది. ఇప్పటికే తన టార్గెట్ అందుకున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం మరో గాసిస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే.. ఈ సినిమాను గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఒక వేళ జనవరి 26న రిలీజ్‌ కాకపోతే.. వచ్చే నెల 8న వ్యాలెంటైన్స్‌ డే స్పెషల్‌గా రిలీజ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానుల్లో సినిమా హడావిడీ తగ్గక ముందే సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. ఈ టైంలో సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేస్తే.. భారీగా వ్యూస్‌ వస్తాయని చిత్ర బృందం భావిస్తుందట. కాగా.. ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాతో శ్రుతిహాసన్ చిత్ర సీమలోకి రీఎంట్రీ ఇచ్చింది.

Related posts

ఊర్మిళపై కంగనా వ్యాఖ్యలు… రామ్ గోపాల్ వర్మ రియాక్షన్…!

vimala p

ఛత్రపతిపై హీరోయిన్ కామెంట్స్… నెటిజన్ల ట్రోలింగ్ 

vimala p

డేవిడ్‌ వార్నర్‌ తో ప్రమాదమే.. : బెన్‌ స్టోక్స్‌

vimala p