telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శృతి హాసన్‌కు కలిసొచ్చిన పోలీసోడు

పదేళ్ళ క్రితం 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో శ్రుతీహాసన్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా శ్రుతికి నిరాశను కలిగించింది. అలానే అటు హిందీ, ఇటు తమిళ సినిమాలు సైతం వరుసగా పరాజయం పాలయ్యాయి. అదే సమయంలో కాప్ స్టోరీ గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ శుత్రికి తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పోలీస్ ఆఫీసర్ పవర్ కళ్యాణ్ భార్యగా తొలి విజయాన్ని తన ఖాతాలో తెలుగులో నమోదు చేసుకున్న శ్రుతీహాసన్ ఇప్పుడు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ… కాప్ స్టోరీ ‘క్రాక్’తోనే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులోనూ పోలీస్ భార్య రవితేజ భార్యగా ఆమె నటించడం విశేషం. చేదు అనుభవాన్ని ఇచ్చిన తొలి తెలుగు సినిమా సంక్రాంతి రాగా, ఇప్పుడీ సినిమా సైతం అదే సీజన్ లో వచ్చి విజయపథంలో సాగడం కాకతాళీయం. మధ్యలో శ్రుతి నటించిన ‘ఎవడు’ మూవీ సైతం సంక్రాతికే విడుదలై సక్సెస్ సాధించింది. అలానే… అప్పట్లో ‘గబ్బర్ సింగ్’ మూవీ విడుదలయ్యే సమయానికి పవన్ కళ్యాణ్, శ్రుతీహాసన్ తో పాటు అటు నిర్మాత, ఇటు దర్శకుడు సైతం చక్కని విజయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. నిజానికి ‘క్రాక్’ విడుదల సమయానికి ఈ నలుగురిది కూడా అదే పరిస్థితి. దాంతో సక్సెస్ నే టార్గెట్ చేస్తూ వీరు పడిన శ్రమకు తగ్గ ఫలితాన్ని ‘క్రాక్’ కలెక్షన్ల రూపంలో తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు.

Related posts