telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 129

karona virus

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 129కి చేరింది. నిన్న ఒక్కరోజు 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ర్టాల్లో తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటుంది. విదేశాల నుంచి ప్రయాణికులపై నిఘా పెట్టింది. అన్ని ఎయిర్‌పోర్టుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.

కర్ణాటకలో మొత్తం 10 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. ఇటీవలే యూకే నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపింది. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా కొవిడ్‌-19 వైరస్‌ ఇప్పటివరకు 162 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1,82,547 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 7,164 మంది మృతి చెందారు.

Related posts