telugu navyamedia
సినిమా వార్తలు

హీరోగా కౌశల్ ఎంట్రీ ?

Koushal Entry as a Hero
“బిగ్ బాస్-2” షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న కౌశల్ హౌజ్ లో తన ప్రవర్తనతో బయట భారీ క్రేజ్ తో పాటు విజేత కూడా అయ్యాడు. ఈ షో ద్వారా కౌశల్ ఎంతగా పాపులర్ అయ్యాడంటే బయట ఆయన పేరిట “కౌశల్ ఆర్మీ” అంటూ ఓ సైన్యం కూడా ఏర్పడింది. మోడలింగ్ నేపథ్యం నుంచి వచ్చిన కౌశల్ గతంలో కొన్ని టీవీ సీరియల్స్ నటించిన విషయం తెలిసిందే. అంతేకాదు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు.
హీరో కావాలనేది తన లక్ష్యమని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు కౌశల్. తాజాగా ఓ యువ దర్శకుడు చెప్పిన లైన్ నచ్చడంతో హీరోగా చేయడానికి కౌశల్ అంగీకరించినట్టు సమాచారం. ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నాడనీ, ఆయనకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు వున్నాయని,  రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఆధారంగా ఈ సినిమా కొనసాగుతుందనే, ఈ సినిమాకి ‘సేనాని’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారికంగా సినిమాను ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. 

Related posts