telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కౌసల్య కృష్ణమూర్తి : ది క్రికెటర్” టీజర్

Kousalya-KRishnamurthy

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం “కౌసల్య కృష్ణమూర్తి”. ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌. ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు. ఇక టీజర్ విషయానికొస్తే… ఎమోషన్ తో కట్టిపడేసే విధంగా ఉంది. పల్లెటూరిలో రైతులు ఎదుర్కొనే కష్టాలు, క్రికెటర్ కావాలనుకునే యువతి ఆమె కోరికను ఏ విధంగా నెరవేర్చుకుంది అనేది చిత్ర కథాంశం. “క్రికెట్ చాలా కష్టమైన ఆట.. నీలాంటి సున్నితమైన ఆడపిల్లలు ఆడలేరు” అనే డైలాగ్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

Related posts