telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నరసాపురంలో టీడీపీకీ షాక్..బరిలో రెబల్ అభ్యర్థి కొత్తపల్లి?

Kotthapalli contest Narsapuram

టీడీపీలో కీలక నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరోషాక్ తగలనుంది. నరసాపురం అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ కొత్తపల్లి సుబ్బారాయుడు ఇటీవలే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకే టికెట్ కేటాయించడంతో కొత్తపల్లి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గురువారం అనుచరులతో సమావేశమైన కొత్తపల్లి రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలని కార్యకర్తలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కొత్తపల్లి సుబ్బారాయుడు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.

Related posts