telugu navyamedia
andhra political

మురుగు కాలువలో దిగి..ఎమ్మెల్యే వినూత్న నిరసన

Kotamreddy Sridhar Reddy
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి  మురుగు కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. నియోజకవర్గంలోని 31వ డివిజన్‌ చాణక్యపురి వద్ద ఉన్న వరద కాలవపై బ్రిడ్జి నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీంతో స్థానికులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 
వీలైనంత త్వరగా వరద కాలువపై బ్రిడ్జి నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గంట పాటు మురుగు కాల్వలోనే నిల్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు 45 రోజుల్లోపు బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కాలువలో నుంచి బయటకు వచ్చారు.

Related posts

తెలంగాణ ఓట్ల లెక్కింపు…

vimala p

తెలంగాణలో మందు బాబులకు షాక్.. అమ్మకాలు బంద్!

ashok

రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆగ్రహం..డీజీపీ హాజరవ్వాలని ఆదేశం

ashok