telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతీ వర్షపు నీటి చుక్కను భద్రపరుస్తున్నాం : కొరటాల శివ

Koratala

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం తన తదుపరి సినిమాను చిరంజీవి హీరోగా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లో చిరు 152వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడు. ఎప్పటిలాగే ఈ చిత్రంలోనూ ఏదో ఒక మెసేజ్ ఉంటుంద‌ని అంటున్నారు. అయితే త‌న ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశాన్ని చెబుతూ, దానికి క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాని జోడించి మంచి విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు కొర‌టాల శివ‌. అయితే కొర‌టాల నిజ‌జీవితంలో సందేశం ఇవ్వ‌డ‌మే కాదు కొన్నింటిని బ‌య‌ట కూడా ఫాలో అవుతుంటారు. తాజాగా ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో షేర్ చేస్తూ.. వ‌ర్షపు నీటిని ఒడిసి ప‌డుతున్న‌ట్టు పేర్కొన్నాడు. “మా ఆఫీస్‌లో వాన నీటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతీ నీటి చుక్కను ఇంకుడు గుంతలో భద్రపరుస్తున్నాం” అంటూ త‌న ట్వీట్‌లో తెలిపాడు కొర‌టాల . ఆయ‌న చేసిన ప‌నికి నెటిజ‌న్స్ నుండి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

Related posts