telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు, కొరటాల చిత్రం దేవాలయాల నేపథ్యంలో…?

chiranjeevi flight return with technical issue

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా మంచి విజయాన్ని సాధిస్తుండటంతో ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న చిరు త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు 152వ చిత్రం తెర‌కెక్క‌నుండగా, ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ మొద‌టి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ట‌. రామోజీ ఫిలిం సిటీలో చిత్రం కోసం ప్ర‌త్యేక సెట్ కూడా రూపొందించిన‌ట్టు సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తాన్ని ఈ సెట్‌లోనే చిత్రీక‌రించనున్న‌ట్టు తెలుస్తుంది. రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. చిరు 152వ చిత్రం సోషియో థీమ్‌తో తెర‌కెక్కనుంద‌ని, ఎండోమెంట్స్ విభాగం మరియు దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్ర‌భావం చూపుతాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నార‌ట‌. చిరు దేవాదయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపిస్తారని టాక్. అంతేకాదు ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై అతను ఎలా చర్యలు తీసుకుంటాడు అనేది ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా తెలుస్తుంది. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Related posts