తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం: కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

Komatireddy Venkat Reddy Says RTC

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. నార్కెట్‌పల్లిలో ప్రచార కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.

ఇచ్చిన హామీలు విస్మరించి నియంతలా పరిపాలన సాగించిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ కమిషన్ల కోసమే టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రాజెక్టుల రీడిజైన్‌ చేపట్టారని ఆయన ఆరోపించారు. 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, నిరుపేదల ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

Related posts

డైరెక్టర్ మారుతీ.. ‘చిత్రాలు’…

chandra sekkhar

వైసీపీపై చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

admin

Leave a Comment