telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతు బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదు: రాజగోపాల్‌ రెడ్డి

rajagopal reddy komatireddy

తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని విమర్శించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదని తెలిపారు. రూ.100 కోట్లు మంజూరు చేస్తే శివన్న గూడం, కృష్ణ రాంపల్లి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని తెలిపారు. 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

కానీ ఇంతవరకు ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయని విమర్శించారు. ప్రాజెక్ట్‌లు, భూనిర్వాసితుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ భూనిర్వాసితులకు ఇచ్చిన విధంగానే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Related posts