telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ హీరోలు ఇప్పుడు దానిపైన కన్నేశారు…

ప్రస్తుతం దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయినే దేశంలో అన్‌లాక్ మొదలయింది. దాని నిబంధనల ప్రకారంగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మన ఆంధ్రాలో థియేటర్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరి మన సోదర రాష్ట్రం తమిళనాడులో పరిస్థితులపై ఆరా తీస్తే అక్కడి అగ్ర హీరోలందరూ థియేటర్ల కోసం ఎదురు చూస్తున్నారట. ధనుష్, విజయ్ వంటి స్టార్లు చేసిన సినిమాలు ఇక ఏమీ దారిలేక ఓటీటీ బాటపడుతున్నాయని పూకార్లు షికార్లు చేశాయి. కానీ వారు మాత్రం ఓటీటీపై ఏమాత్రం ఇష్టత చూపడంలేదు. దానితో పాటు అదంతా అబద్దపు ప్రచారమని కొట్టి పారేస్తున్నారు. అయితే ఇటీవల భారీ రికార్డులు సాధించిన విజయ్ మాస్టర్ సినిమా ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని థియేటర్ల కోసం చూస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. మాస్టర్ సినిమాకి దాదాపు రూ.100 కోట్ల ఆఫర్‌ను ఓటీటీ ఇచ్చినా మాస్టర్ టీమ్ నో అనేసిందట. ఆ క్రమంలోనే మాస్టర్ ప్రెస్ నోట్ వైరల్ అయ్యింది. ఆ ప్రెస్ నోట్ కం ప్రకటనకు ‘అవును’ అని ధనుష్ సమాధానం ఇచ్చాడు. ఈ సినిమా తమిళంలో ‘జగమే తందిరామ్’ అంటే తెలుగులో ‘జగమే తంత్రం’ సినిమా ఓటీటీలో వాడుదల కాదని ధనుష్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా కేవలం థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని టీమ్ తెలిపింది. తమిళంలోని పెద్ద సినిమాలు ఓటీటీపై సుముఖం అస్సలు చూపడం లేదు. థియేటర్లు మళ్లీ పుంజుకోవాలంటే స్టార్ల సినిమాలు విడుదలైతేనే అని, దానితో పాటు భారీ లాభాలు రావాలన్నా అది థియేటర్లతోనే వీలవుతుందని అంటున్నారు.

Related posts