telugu navyamedia
సినిమా వార్తలు

అజిత్ పారితోషికం తెలిస్తే షాకే…!!

Ajith

చిత్రసీమలో అగ్రహీరోలు ఒక్కొక్క చిత్రానికి రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకుంటారనే విషయంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది. అయితే ఈ విషయం దర్శక నిర్మాతలకు, కంపెనీ ఆడిటర్‌, ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులకు మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకు చాలా తక్కువగా ఈ విషయం గురించి తెలుస్తుంది. తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అజిత్‌, విజయ్‌ లాంటి సూపర్ స్టార్లు రెమ్యూనరేషన్‌ గా దాదాపుగా రూ.40 నుంచి రూ.50 కోట్లు తీసుకుంటూ ఉండొచ్చని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేకాదు హీరోల ఆయా చిత్ర విజయాలను, కలెక్షన్‌, టోటల్‌ బడ్జెట్‌ను బట్టి కూడా రెమ్యూనరేషన్‌ మారుతూ ఉంటుంది. ఈ వరుసలో గత నాలుగు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన అజిత్‌ ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. “విశ్వాసం” చిత్రం తరువాత బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ “నేర్‌కొండ పార్వై” చిత్రానికి భారీ ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్‌ తాను నటించనున్న కొత్త చిత్రానికి రూ.60 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని కోలీవుడ్ లో విన్పిస్తోంది.

Related posts