telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వ సెంటిమెంట్ .. అజిత్ కి కలిసొస్తుందా…

Ajith

కోలీవుడ్ హీరో అజిత్ ఏది చేసిన అది ఒక సంచలనమే వయస్సు ముదిరే కొద్దీ ఆయన కొట్టే హిట్లు చూస్తుంటే ఇప్పుడున్న కుర్ర కారు మొత్తం కూడా మూతిమీద వేలేసుకుంటున్నారు. అతను చేసిన సినిమాలు అన్ని కూడా వి అంటే అక్షరం తో చెయ్యడం ఒక విశేషం అయితే అది అనుకోకుండా వి అనే అక్షరం అతని హిట్ కి కారణం అవ్వడం కూడా చెప్పుకోవాల్సిన అంశం. విశ్వాసం, వీరం, వివేకం, వేదాలం లాంటి బ్లాక్ బస్టర్స్ అన్ని కూడా ‘వ’ తో కలిసి రావడం తో ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన సినిమా “వలిమై” కూడ ‘వ’ తోనే మొదలవుతుండటం తో అటు ఫాన్స్ ఇటు ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా అజిత్ కెరీర్ లో అరవైవ చిత్రం అవ్వడం తో ఫాన్స్ ఇంకా పండగ చేసుకుంటున్నారు.ఈ మూవీ లో ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్ర పోషించ నున్నారు అనే వార్త ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇలాంటి ఒక చిత్రాన్ని నిర్మించే అవకాశం బాలీవుడ్ బోనీ కపూర్ దక్కించుకోవడం కూడా జనాల్లో ఉత్కంఠను రేపుతుంది. ఈ సినిమా కి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించనున్నారు.నిరవ్ షా దీనికి ఛాయా గ్రహణం అందించనున్నారు.హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నటించడం కూడా ఇంకా ప్లస్ అవనుంది.ఈ విధంగా ఇతను హిట్ మీద హిట్లు కొడుతుంటే మిగతా హీరోలకు మాత్రం చాలా అసూయగా కూడా ఉంది.సెంటిమెంట్ బాగా ఎక్కువ అని అందరూ అనుకుంటూ వుంటారు.కానీ ఈ సెంటిమెంట్ అనే అయింట్మెంట్ మాత్రం ఈ స్టార్ కి పని చేసినంత బాగా మరే స్టార్ కి పని చేసి ఉండదు అని సినీ వర్గం అంత మరియు సామాన్య సినీ ప్రేమికులు కూడా తెగ మాట్లాడేసుకుంటున్నారు.

Related posts