telugu navyamedia
తెలంగాణ వార్తలు

కొల్లాపూర్ హైటెన్ష‌న్‌ : జూపల్లి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

*కొల్లాపూర్ హైటెన్ష‌న్‌..
*ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి ఇంటివ‌ద్ద ఉద్రిక్త‌త‌
*జూపల్లికి వ్య‌తిరేకంగా ఎమ్మెల్యే అనుచ‌ర‌లు నినాదాలు
*బారికేడ్ల‌ను తొల‌గించిన ఎమ్మెల్యే అనుచ‌రుల‌

*జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
*ఎమ్మెల్యే అనుచ‌రులను అడ్డుకున్న‌పోలీసులు
*పోలీసుల‌తో ఎమ్మెల్యే అనుచ‌రులు వాగ్వాదం..

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి…పరస్పర ఆరోపణలు, సవాళ్ల యుద్దం పీక్ స్టేజ్‌కి చేరుకుంది.

నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో ఒకరిపై ఒకరు బహిరంగంగానే పరస్పర, వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా నేతలిద్దరూ ఓపెన్‌ చాలెంజ్‌ చేస్తూ బహిరంగ చర్చకు సిద్దమంటూ కామెంట్స్‌ చేశారు .

ఈ విషయమై కొల్లాపూర్ అంబేడ్కర్‌ చౌరస్తాలో ఇవాళ బహిరంగ చర్చకు సిద్దమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు చేయగా .. అయితే ఈ విషయమై తాను జూపల్లి కృష్ణారావు ఇంటికే వెళ్లి చర్చకు సిద్దంగా ఉన్నానని హర్షవర్ధన్ రెడ్డి ప్రకటించారు.

ఇరువర్గాల నుంచి బహిరంగచర్చకు అనుమతివ్వాలంటూ పోలీసులకు దరఖాస్తులు వెళ్లగా తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొల్లాపూర్‌లో ఇవాళ జనం గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్‌ కొల్లాపూర్‌ చేరుకున్నారు.

మ‌రోప‌క్క ఇద్ద‌రు నేత‌లు ఇంటి నుండి బ‌య‌ట‌కు వ‌స్తే అదుపులోకి తీసుకుంటామ‌ని అంటున్నారు. బ‌హిరంగ చ‌ర్చ‌ల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు తెలుపుతున్నారు.

Related posts