telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అప్పటి వరకు నన్నెవరూ .. సీరియస్ గా తీసుకోలే.. : కోహ్లీ

london municipal office challan to kohli

కష్టే ఫలి .. అన్న దానికి కోహ్లీ నిదర్శనం గా నిలిచాడు. క్రికెట్ లో తన గురువు అయిన ధోనీ కూడా మించిన శిష్యుడు గా ఎదిగాడు. ఎంతటి విషమ పరిస్థితి అయినా కూడా తన నిగ్రహాన్ని ఎప్పుడు అలాగే వదిలిపెట్టకుండా ఉండే మనిషిగా ధోనీ పేరు సంపాదించుకుంటే, అసలు భయమే తెలియని వ్యక్తి గా కోహ్లీ అందరికీ పరిచయం. ఇలా ఉండటం తనకు ఎలా సాధ్యం అని కొంతమంది విలేకరులు ప్రశ్నించగా కోహ్లీ పై విధంగా సమాధానం ఇచ్చాడు నా ప్రతి అడుగు నాపై గౌరవం కారణంగా ఎటువంటి భయం లేకుండా ఆటలు ఆడటం మొదలు పెట్టాడు అని ఆ భయం లేని తనమే ఇప్పుడు వరకు కొనసాగుతూ వచ్చింది అని పేర్కొన్నాడు. అసలు నేను మైదానంలో అడుగుపెడుతుంటే ఎవరి మొహం లో ఎటువంటి మార్పు కనిపించేది కాదు అది నా పైన గౌరవం కొద్దీ కాదు అలాగే నా మీద వాళ్ళకి భయం ఉండేది కాదు అసలు నేను అడుగుతున్నాను అంటే ఎవరు ఎటువంటి సంకోచం భయం ఆందోళన గాని అలాగే ఉత్సాహంగా కనిపించేది కాదు.

దీనిని ఎలాగైనా మార్చాలి అన్న దృఢసంకల్పంతో నేను ఇంకా ఎక్కువగా కృషి చేయడం మొదలుపెట్టాను ఆ కృషి ఫలితంగానే విజయం కనిపిస్తూ వచ్చింది ఆ తర్వాత నుండి ఇక కథ మొత్తం మీ అందరికీ తెలిసిందే అని కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని కోహ్లీని చూసి నేర్చుకోవచ్చు. ఎన్నో వదంతులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి నిగ్రహం కోల్పోకుండా కష్టపడుతూ తన ఆట మీద కాన్సన్ ట్రేషన్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఫిట్నెస్ ని మెయింటేన్ చేసుకుంటూ కోహ్లీ తన కెరియర్ లో ఎటువంటి ఆటుపోట్లను అయినా ఎదుర్కొన్నారు. మనం గౌరవం సంపాదించుకోవాలంటే ఎదుటి వారిని మనం బెదిరించి లేదా బతిమాలు సంపాదించలేదు. మన మీద మనం కృషిచేసి, మన విలువను పెంచుకుంటే గౌరవం అదే వస్తుంది అని కోహ్లీ వివరించాడు.

Related posts