• Home
  • వార్తలు
  • బిర్యానీ వద్దు…వెజ్ ముద్దు అంటున్న.. కోహ్లీ..
Trending Today క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

బిర్యానీ వద్దు…వెజ్ ముద్దు అంటున్న.. కోహ్లీ..

kohli changed his diet to veg

భారత క్రికెట్ టీం సారధి విరాట్ కోహ్లీ కి బిర్యానీ అంటే మహా ఇష్టం అంట. కానీ తాజాగా తన ఇష్టాలను పక్కన పెట్టేసి పూర్తిగా శాకాహారిగా మారిపోయాడట. ఫిట్నెస్ ఫై విపరీతంగా ద్రుష్టి పెట్టె ఈ పరుగుల మంత్రం ఒక్కసారిగా తనకు ఇష్టమైన బిర్యానీ వదిలేసి డైట్ అంతా శాఖాహారమే తీసుకుంటున్నాడట.. ఈ విషయం తన స్నేహితులు స్పస్టమక్ చేస్తున్నారు. నాలుగు నెలల క్రితమే కోహ్లీ మాంసాహారాన్ని మానేసి, పూర్తిగా శాకాహారమే తీసుకుంటున్నాడట. దీనితో తాను మరింత దృడంగా అయినట్టు చెబుతున్నారు సన్నిహితులు.

ఫిట్నెస్ అంటే పడిచచ్చిపోయే కోహ్లీ మాంసాహారం తీసుకోకుంటే ఇంకా ఫిట్ గా ఉంటారని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు తన డైట్ లో కూరగాయలు, సొయా, ప్రోటీన్లతో కూడిన ఆహారమే చేర్చి తీసుకుంటున్నాడట. కొత్త డైట్ ప్రారంభించాక కోహ్లీ మరింతగా ఫిట్ గా కనిపిస్తున్నదని, జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడిందని అతడి సన్నిహితులు చెపుతున్నారు. ఇక భర్త శాఖాహారి అయ్యేసరికి కోహ్లీ సతీమణి అనుష్కశర్మ కూడా శాఖాహారమే తీసుకుంటున్నారట. ఎంత అన్యున్యమైన జంటో కదా..నిజానికి శాకాహారమే మేలు, మీరు ఒక సారి ప్రయత్నించండి.

Related posts

బలవంతంగా మద్యం తాగించి రేప్ చేశాడు… బాలీవుడ్ నటి

jithu j

అమరావతికి…ఫ్యాషన్ టెక్ ఇన్స్టిట్యూట్…

chandra sekkhar

మరో సారి పేస్ బుక్ సమాచారం చోరీ…ఒప్పుకున్న సంస్థ…

chandra sekkhar

Leave a Comment