telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాత్రూములోకి తీసుకెళ్లి… ఈ హీరోయిన్ ను ప్రియుడు…!?

Koina

బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మిస్ ఇండియా ఇంటర్ కాంటినెంట్ పోటీలో విజేతగా నిలిచిన కోయినా మిత్రా హిందీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటోంది. మోడల్ గా మంచి పేరు తెచ్చుకున్న కోయిన సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. 2004లో ఆమె “ముసాఫిర్” సినిమా చేసింది. ఈ మూవీ మంచి హిట్ అయ్యింది. ఇందులో ఓ సాకి సాకి అనే సాంగ్ చేసింది. ఈ సాకి సాంగ్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. ఆ సమయంలో ఈ అమ్మడు శరీరానికి తగ్గట్టుగా ముక్కు సన్నగా నాజూగ్గా ఉండేలా సర్జరీ చేయించుకుంది. కానీ ఆ సర్జరీ కారణంగా ఆమె అందం మొత్తం పోగొట్టుకుంది. కాగా… ఈ అమ్మడు టర్కీకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతని ప్రేమ దారుణంగా ఉండేదట. బయటకు కూడా వెళ్ళేనిచ్చేవాడు కాదట. షూటింగ్ ఉంది వెళ్ళాలి అంటే బాత్ రూమ్ లో పెట్టి తాళం వేశాడట. అలాగే పెళ్లి చేసుకున్నాక టర్కీకి తీసుకెళ్లి తన పాస్ పోర్ట్ ను ముక్కలుగా చించేస్తానని చెప్పాడట. దీంతో పాపం కోయిన భయపడి అతనికి బ్రేకప్ చెప్పేసి వచ్చేసిందట. ఈ విషయాన్ని బిగ్ బాస్ షోలో బయటపెట్టింది ఈ బ్యూటీ.

Related posts