telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకుడిగా.. అనేక బాషలలో .. పలు అవార్డులతో.. కోడిరామకృష్ణ..

kodiramakrishna as director with awards

తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన అతి కొద్దీ ప్రముఖ దర్శకులలో ఒకడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు కోడి రామకృష్ణ. దర్శకుడిగా అనేక మంది హిరోలకు లైఫ్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంతోనే కెరీర్ ప్రారంభించిన హీరోలు కూడా ఉన్నారు. నటులను అగ్రహీరోలు చేసిన ఘనత రామకృష్ణకే దక్కుతుంది. ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన తెలుగులో అగ్రకథానాయకులందరితో సినిమాలు తీశారు. తెలుగుతోపాటు తమిళ్, హిందీ, కన్నడ మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన అనేక మంచి చిత్రాలను అందించారు.

కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలలో అంకుశం, అరుంధతి, దేవి, పుట్టింటికి రా చెల్లి, మంగమ్మగారి మనవడు, రిక్షావోడు, తలంబ్రాలు, దేవీపుత్రుడు, శ్రీనివాస కళ్యాణం, భారత్ బంద్, ముద్దుల మావయ్య, అమ్మోరు, ఆహుతి, ముక్కుపుడక, ముద్దుల కృష్ణయ్య, దేవుళ్లు, స్టేషన్‌ మాస్టర్‌, చుట్టాలబ్బాయి, బాలగోపాలుడు, సోగ్గాడికాపురం, 20వ శతాబ్దం, పెళ్లాం చెబితే వినాలి, రాజధాని, పోలీస్‌లాకప్‌, గాడ్‌ఫాదర్‌, పెళ్లి, పెళ్లిపందిరి, పెళ్లికానుక, పంజరం, అంజి లాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.

2012లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కోడిరామకృష్ణ అందుకున్నారు. 10 నంది అవార్డులు, 2 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. శత్రువు సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

Related posts