telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కోడెల మృతిపై .. సన్నిహితుల అనుమానాలు..

kodela shivaprasad

కోడెల ఆత్మహత్యకు ముందు తన సన్నిహితులతో కొన్ని విషయాలు చెప్పుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారట. ఆ విషయాలు మీడియాకు చెప్పిన సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కోడెల కుమార్తె విజయలక్ష్మి మాట్లాడుతూ నాన్నఅంటే తమకు ప్రాణమని, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని స్పష్టం చేశారట. కొడుకు, కూతురు అంటూ ఆరోపణలు చేసి ఆయన్ని ఎంత క్షోభ పెట్టారో మాటల్లో చెప్పలేనని అన్నారు.మీ అందరికీ ఓ దండమని,మా బతుకు మమ్మల్ని బతకనివ్వండని రోదిస్తూ వేడుకున్నారు. ఆయన మానసికంగా ఎంత నరకం అనుభవించారో తమకు తెలుసని, వెళ్లిపోయిన మనిషి గురించి కూడా చెడు ప్రచారం చేస్తున్నారని, కనీసం ఇప్పుడైనా ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించకండని భోరున రోదిస్తూ కోడెల కుమార్తె విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.

కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి పదవులు నిర్వహించారు. కోడెల మరణంతో ఇప్పటికే, కోట సెంటర్‌లో ని ఆయన ఇంటికి అనుచరులు,అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయనకు నరసరావుపేట,చుట్టు పక్కల గ్రామాల్లో భారీ అనుచర గణం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ సందర్భంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 15 రోజులపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నరసరావుపేట ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts