telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబు పిల్లలు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమిదే…!?

Sobhan-Babu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. శోభన్ బాబు తన పిల్లలు సినిమాల్లోకి రాకపోవడానికి గల కారణాన్ని ఒకానొక సందర్భంలో ఆయనే స్వయంగా వెల్లడించారు.

“బలిదానం” సినిమా షూటింగు సమయంలో… శోభన్ బాబు తన కూతురిగా నటిస్తున్న బాల నటిని చెంపపై కొట్టాల్సిన సన్నివేశం ఉందని చెప్పారు దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ గారు. “ఇంత చిన్న పాపను కొట్టాలా ?” అన్నారు శోభన్ బాబు. “నటించడమే కదండీ…” అన్నారు దర్శకులు. “నటనే అయినా చంటిపాప భయపడుతుంది కదండీ… ఈ సీన్ లో ఎమోషన్ క్యారీ కావడానికి కొట్టడమే అవసరం అనుకుంటే… అలాగే చేద్దాం… లేదంటే కసురుకుంటే సరిపోతుంది కదా…”అన్నారు శోభన్ బాబు. దర్శకుడు “తప్పకుండా అలాగే చేద్దాం…” అని చెప్పి పాపను కసురుకుంటున్నట్లుగానే షాట్ తీశారు. శోభన్ బాబుకు చిన్నపిల్లలంటే ప్రాణం. పసిపిల్లల్ని ముద్దాడడం అంటే అంతకన్నా ఇష్టం. అందుకే ఆ షాట్ పూర్తవ్వగానే ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి చాక్లెట్లు తెప్పించి ఇచ్చారు శోభన్ బాబు.

Balidanam

ఆ తరువాత దర్శకుడు చంద్రశేఖర్ గారు “మీకు పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా…” అన్నారు. “అవును” అన్నారు శోభన్ బాబు. “అవునూ… మీ పిల్లల్ని సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారా ?” మాటల్లో అడిగేశారు దర్శకుడు చంద్రశేఖర్. “నెవర్… నెవర్” చెప్పారు శోభన్ బాబు. “ఎందుకు…?” అడిగారు దర్శకుడు. “వెరీ సింపుల్… సినిమా వృత్తి అనేది బయట ప్రపంచానికే ఆనందంగా, ఆహ్లాదంగా కన్పిస్తుంది. కానీ ఈ వృత్తిలో ఉన్నవారెవరికీ ఆహ్లాదంగా అనిపించదు. చూసేవారికి వెన్నెల్లా కన్పిస్తుంది. కానీ మనం మాత్రం ఎండల్లో కొండల్లో పాటలు పాడుకోవాల్సి వస్తుంది. ఫైటింగ్ చేసి కాళ్ళూ, కీళ్లూ విరగ్గొట్టుకుంటూ ఉంటాము. కింద కూర్చుని చూసేవాడు మాత్రం ఈలలు వేస్తూ ఉంటాడు. మీకు తెలియనిదేముంది… ఇది చాలా క్లిష్టమైన వృత్తి” చెప్పుకొచ్చారు శోభన్ బాబు.

“ఏ వృత్తిలో మాత్రం కష్టాలు ఉండవండీ…” అడిగారు దర్శకులవారు. “ఆ… అన్ని వృత్తుల్లోనూ ఉంటాయి. కానీ అన్ని వృత్తుల్లో ఫిజికల్ శ్రమ మాత్రమే ఉంటుంది. లేదా మానసిక ఒత్తిడి మాత్రమే ఉంటుంది. కానీ ఈ వృత్తిలో అదనంగా ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. నటుడి హృదయంలోకి ఒక భావం వస్తేనే అది ముఖంలో కన్పిస్తుంది. వాయిస్ లో విన్పిస్తుంది. అందుకే ముందుగా నటీనటులు ఏ సన్నివేశాన్నయినా హృదయంలోకి తీసుకోవాలి. ఇలా హృదయం క్షణక్షణమూ దెబ్బతింటుంటే మనకు తెలియకుండానే ఆ గుండె స్ట్రెస్ కు గురవుతుంది. అందుకే “మోస్ట్ అఫ్ ది ఆర్టిస్ట్స్ ఇన్ జనరల్ డై అవుట్ అఫ్ హార్ట్ ఎటాక్” వివరించారు శోభన్ బాబు.

Sobhanbabu Awards 2018 images

“అవును” అన్నారు శోభన్ బాబు. “అందుకే నా బిడ్డల్ని ఈ వృత్తికి దూరంగా ఉంచాను. మనకెలాగూ ఈ శ్రమ తప్పదు. ఈ నటన నా పిల్లలకు అలవాటైతే… అది వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు అలవాటై… ఆ తరువాత తరాలు కూడా నటన కోసమే పుట్టామని అనుకుంటారు. అలా నట వారసులు తయారవుతారు. ఈ ప్రాసెస్ లో నా మనవడికో, నా మునిమనవడికో ఈ వృత్తి అంటే ఏవగింపు కలిగి, అసలు దీనంతటికీ కారణం మా ముత్తాతే కారణం… అంటే నేనే కారణమని వాళ్ళు తిట్టుకుంటారు. ఇదంతా అవసరమా ?” అడిగారు శోభన్ బాబు. “కానీ ఏ వృత్తిలో లేనటువంటి స్టార్ ఇమేజ్ ఉంది కదండీ… డబ్బులు అందరూ సంపాదించుకుంటారు. కానీ పేరు, అభిమానులు…” అంటూ ఆగిపోయారు దర్శకుడు. “మీరు చెప్పింది నిజమే. పేరు కోసం, అభిమానుల కోసం ఇంతలా కష్టపడాలి. ఒక విధంగా ఇది అదృష్టమే అయినా… మన జీవితం మన చేతిలో ఉండదు కదా…” అన్నారు శోభన్ బాబు. “అవుననుకోండి…” అన్నారు దర్శకుడు.

Sobhan-Babu2

“మీరు నమ్ముతారో లేదోగానీ… నా కొడుకు ఎప్పుడూ షూటింగ్ చూడలేదు. నా కొడుకేకాదు… భార్య, కూతుళ్లు ఎవరూ షూటింగ్ చూడలేదు, సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. నా కొడుకు ఎప్పుడైనా షూటింగ్ సందర్భంలో నా సంతకం కావాల్సివస్తే కార్లో కూర్చుని కబురు చేస్తాడు. నేను లొకేషన్ నుంచి కారు దగ్గరకు వెళ్లి సంతకం చేస్తాను. అంతేతప్ప తను సెట్లోకి అడుగుపెట్టడు. ఇదేమీ గొప్ప విషయం కాదు. కానీ… వాళ్ళను దూరంగా పెట్టడానికి ట్రై చేశాను. యన్ యాక్టర్ విల్ బి ఫీజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ ఎగ్జాస్టెడ్… ఇది ప్రేక్షకులకు కన్పించేంత ఆహ్లాదకరమైన వృత్తి కాదు. అందుకే ఒక తండ్రిగా ఈ వృత్తిని నా బిడ్డలకు కోరుకోలేకపోయాను. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నా బిడ్డలకు సినిమా వ్యాపకం ఉండదనే అనుకుంటున్నాను. ఈ విషయం తప్పో ఒప్పో కాలమే నిర్ణయించాలి” అన్నారు శోభన్ బాబు. ఆయన మాటలతో ఏకీభవించినట్లుగా నవ్వారు దర్శకుడు. అంతలో షాట్ రెడీ అయ్యింది. ఇదన్నమాట శోభన్ బాబు తన పిల్లలు సినిమా రంగంలోకి అడుగుపెట్టకుండా చేయడానికి గల కారణం.

ఇవి కూడా చదవండి

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

జయలలితతో శోభన్ బాబు డిన్నర్…

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

Related posts