telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఎండలు మండుతున్నాయని.. ఏసీ లోనే ఉంటున్నారా..! తస్మాత్ జాగర్త!!

know how dangerous is Air conditioners

ఈసారి కూడా వేసవికాలంలో గతం కంటే ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరు ఎండలో బయటకు రాకుండా అటు కార్యాలయాలలోను, ఇటు ఇంటిలోనూ ఏసీ గదులలో గడిపేస్తున్నారు. ఎక్కువగా AC లో గడపటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం…!

* AC లో ఎక్కువగా గడిపేవారికి చర్మం పొడిగా మారుతుంది. AC లో కూర్చొని ఒక్కసారిగా ఎండలోకి వెళ్ళితే ఈ సమస్య బాగా పెరుగుతుంది. పొడి చర్మ తత్త్వం కలవారైతే ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.

* కళ్ళు పొడిగా ఉండేవారు AC లో ఎక్కువగా ఉండకూడదు. AC లో ఉండుట వలన కంటిలో ద్రవాల పరిమాణం తగ్గి కళ్ళు పొడిగా మారతాయి.

know how dangerous is Air conditioners* కళ్ళు పొడిబారే సమస్య ఉన్నవారు అసలు AC లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే సమస్య ఎక్కువ అవుతుంది.

* AC గదుల్లో తేమ శాతం తక్కువగా ఉండుట వలన డీహైడ్రేషన్ సమస్య వస్తుంది, విపరీతమైన దాహం అవుతుంది.

* AC లో ఎక్కువగా ఉండటం వలన ముక్కు, గొంతు, కళ్లు మరియు శ్వాస కోశ వ్యాధులు వస్తాయి. ముక్కు రంద్రాలు మూసుకుపోయి ముక్కు లోపలి భాగంలో ఉండే సున్నిత పొర వాపునకు గురి అయ్యి ఇన్ ఫెక్షన్ కి దారి తీస్తుంది.

* AC గదుల్లో ఎక్కువగా గడిపే వారికి ఎక్కువగా తలనొప్పి వస్తుంది. అది మైగ్రేన్ కి కూడా దారి తీయవచ్చు.

Related posts