• Home
  • Trending Today
  • ఆ నటి బలవంతంగా ముద్దుపెట్టుకుంది : బాలీవుడ్ నటి
Trending Today సినిమా వార్తలు

ఆ నటి బలవంతంగా ముద్దుపెట్టుకుంది : బాలీవుడ్ నటి

kaneez-surka-and-aditi-mitt

హాస్యనటి అదితి మిట్టల్ కు మరో హాస్యనటి కనీజ్ సుర్ఖా షాక్ ఇచ్చింది. #మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తానన్న కమెడియన్ అదితి మిట్టల్ ముందుగా తనకు క్షమాపణలు చెప్పాలని మరో కమెడియన్ కనీజ్ సుర్ఖా డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే ఆమె మీటూ ఉద్యమానికి మద్దతు గురించి మాట్లాడాలంది. అదితి తనను మానసిక సంఘర్షణకు గురి చేసిందని కనీజ్ ఆరోపిస్తున్నారు.

“రెండేళ్ల క్రితం.. అంధేరీ బేస్లో ఓ కామెడీ షో నిర్వహిస్తున్నప్పుడు… అక్కడ సుమారు 100 మంది ప్రేక్షకులు ఉన్నారు. స్టేజ్ పై నాతో పాటు ఇతర కమెడియన్లు కూడా ఉన్నారు. అయితే అకస్మాత్తుగా స్టేజీ మీదకు వచ్చిన అదితి నన్ను బలవంతంగా, అందరి ముందూ ముద్దు పెట్టుకుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడేమీ చేయలేకపోయాను. కానీ ఏడాది కిందట తనని కలిసినపుడు నాకు క్షమాపణ చెప్పాల్సిందిగా అడిగాను. అయితే సరే కానీ అంటూ మరోసారి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అందుకే ఇప్పుడు తను నాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి” అంటూ కనీజ్ తన #మీటూ స్టోరీని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

“ఇది ప్రతీకార చర్య కాదు. ఈ స్టోరీ ఆధారంగా మీ సొంత ఎజెండాను ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించకండి’ అంటూ వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులను హెచ్చరిస్తూ మరో ట్వీట్ చేశారు. #మీటూ ఉద్యమానికి సపోర్టు చేస్తానన్న అదితి తన తప్పు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని వెల్లడించానని ఆవిడ పేర్కొన్నారు.

Related posts

సినిమాల కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాను… విక్కీ కౌశల్

nagaraj chanti

హన్సిక మోత్వానీ ‘గులేబకావళి’ పాట..

admin

‘ప్రయత్నం’ సినిమా ప్రెస్ మీట్…

chandra sekkhar

Leave a Comment