telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రిషభ్‌పంత్‌ కు .. క్లూసెనర్‌ సూచనలు ..

klusener advice to rishabh pant

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు లాన్స్‌ క్లూసెనర్‌, భారత ఆటగాడు రిషభ్‌పంత్‌ నిలకడగా రాణించేందుకు సలహాలు ఇచ్చాడు. అతడి వైఫల్యాల నుంచే కాకుండా ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవాలని సూచించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సిక్సర్ల మోత మోగించే పంత్‌కు అంతర్జాతీయ వన్డేల్లో 22.90, టీ20ల్లో 21.57 సగటే ఉండటం గమనార్హం. పంత్‌ పొరపాట్లను ఎత్తిచూపడం నాకు ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అలాంటి ప్రతిభావంతుడు ఎప్పుడూ ముందుండాలి. కుదురుకోవడానికి తనకు తాను సమయం తీసుకోవాలి. తన ప్రతిభను ప్రదర్శించేందుకు కాలం సాయపడుతుంది. తన తప్పుల నుంచే నేర్చుకోవడం కాకుండా ఇతరుల తప్పుల నుంచి నేర్చుకొంటేనే అంతర్జాతీయ క్రికెట్లో ముందుంటారు.

తనవి మాత్రమే కాకుండా ఇతరుల తప్పుల నుంచి నేర్చుకొంటేనే త్వరగా మెరుగవుతారు.. అని క్లూసెనర్‌ అన్నాడు. ఎంఎస్‌ ధోనీ కెరీర్‌ చరమాంకంలో కలిసి ఆడటం ప్రతిభావంతుడైన పంత్‌ అదృష్టం. తన సీనియర్‌ నుంచి అతడికి సరైన సలహాలు వస్తాయి. పంత్‌కు అద్భుతమైన కోచ్‌ల శిక్షణ లభిస్తోంది. వారు అతడి సహజ ప్రతిభను పెంచి పోషిస్తారు’ అని క్లూసెనర్‌ అన్నాడు. గతంలో అతడు దిల్లీ జట్టుకు సలహాదారుగా పనిచేశాడు. మళ్లీ తిరిగొచ్చేందుకు ఆసక్తి చూపించాడు.

Related posts