telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శర్వానంద్ సాయిపల్లవి కాంబినేషన్ లో మరో సినిమా …!

sarvanand

నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఫిదా’ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. వేసవిలో కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శర్వానంద్ సాయిపల్లవి ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. కానీ త్వరలోనే ఈ జంట మళ్లీ అభిమానులకి ఆనందాన్ని కలిగించనుందని తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ ఇద్దరికీ ఒక ప్రేమకథను వినిపించాడట. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం కిషోర్ తిరుమల .. రామ్ హీరోగా ‘రెడ్’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విడుదల తరువాత, శర్వానంద్ ను .. సాయిపల్లవిని సెట్స్ పైకి తీసుకెళతాడని అంటున్నారు. రెండోసారైనా ఈ జంట సక్సెస్ ను అందుకుంటుందేమో చూడాలి.

Related posts