telugu navyamedia
రాజకీయ వార్తలు

యుద్దాలలో ఓడిపోయినా పాకిస్థాన్‌కు బుద్ధి రాలేదు

BJP Kishan Reddy Says Threatening Calls

యుద్దాలలో ఓడిపోయినా పాకిస్థాన్‌కు బుద్ధి రాలేదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. భారతదేశాన్ని చీల్చి జమ్మూ కాశ్మీర్‌ను సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఘటనలో వీర మరణం పొందిన సైనికులకు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి సభకు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాకిస్థాన్‌లో ఇస్లాం రాజ్యం నడుస్తోందని.. అక్కడ ఉపాధి లేదు కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భద్రతా బలగాలకు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు.

ఎమ్మెల్సీ రామచందర్‌రావు మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడి ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడటం మంచి పరిణామం కాదన్నారు. భారతదేశాన్ని ముక్కలు చేసి సమగ్రత, సమైఖ్యతను దెబ్బతీయాలని ఏళ్ల తరబడి పాకిస్థాన్‌ యోచిస్తోందన్నారు. చైనా తప్పా మిగితా దేశాలు పాకిస్థాన్‌ చర్యను ఖండించాయని గుర్తుచేశారు.

Related posts