telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం 1400 వెంటిలేటర్లు ఇస్తే 500 కూడా ఉపయోగించలేదు: కిషన్‌రెడ్డి

kishanreddy on ap capital

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శనాస్త్రలు సంధించారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం 1400 వెంటిలేటర్లు కేటాయిస్తే కనీసం 500 వెంటిలేటర్లను కూడా ఉపయోగంలోకి తీసుకురాలేదని ధ్వజమెత్తారు.

కరోనా సమయంలో రాష్ట్రానికి 13.85 లక్షల ఎన్‌95 మాస్కులు, 2.99 లక్షల పీపీఈ కిట్లు, 3.12 లక్షల పీసీఆర్ కిట్లు, 42 లక్షల హెచ్‌సీక్యూ మాత్రలు ఇచ్చినప్పటికీ ఇంకా కేంద్రం ఆదుకోవడం లేదని చెప్పడం సరికాదన్నారు. కరోనా వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయద్దని హితవు పలికారు.

సచివాలయం కూల్చివేతపై ఉన్న శ్రద్ధలో కొంచెమైనా కొవిడ్‌ నియంత్రణపై పెట్టి ఉంటే రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.కేసీఆర్ కిట్లలో ఒక్కో కిట్‌కు రూ. 6వేలను, రేషన్ బియ్యంలో కిలోకు రూ. 30 రాయితీని కేంద్రం భరిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts