telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్‌డౌన్‌ పొడిగించాలని అందరూ అడుగుతున్నారు: కిషన్‌ రెడ్డి

Kishan Reddy

కరోనా కట్టడికి అమలవుతున్న లాక్‌డౌన్‌ పొడిగించాలని అందరూ అడుగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ రోజు రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు.దేశంలో కరోనా మూడో దశకు చేరలేదని, ఒకవేళ చేరితే ఇబ్బందులు వస్తాయన్నారు.

ఇంకా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయని తెలిపారు. మాస్కులు లేకుండా బయటకు రావద్దని ప్రభుత్వాలు నిబంధనలు విధిస్తున్నాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కొనసాగించే అంశంపై మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వివిధ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడుతున్నారని చెప్పారు.

ఈ రోజు మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి మాట్లాడతారని తెలిపారు.సీఎంలతో సమావేశం ముగిసిన వెంటనే లేక ఈ రోజు రాత్రి మోదీ ఓ స్పష్టమైన ప్రకటన చేస్తారు. ప్రజలకు నచ్చజెప్పే పని మోదీకి మాత్రమే సాధ్యం. జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. లాక్‌డౌన్‌ పొడిగించాలని మేము కూడా చెప్పాం.. అందరూ ఇదే చెబుతున్నారు’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

Related posts