సినిమా వార్తలు

'కిరాక్ పార్టీ' చేస్తానంటున్న నిఖిల్..

విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే నిఖిల్ ఈసారి కాలేజీ కుర్రాడి అవతారమెత్తాడు. కొత్త దర్శకుడు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. కన్నడలో విజయవంతమైన ‘కిరిక్ పార్టీ’ చిత్రానికిది రీమేక్ గా తెరకెక్కుతుంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రంలో మార్పులు చేర్పులు చేశారు. ఈ చిత్రానికి చందూ మొండేటి మాటలు రాయగా.. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. కాగా.. ఈ చిత్రంలోని మొదటి పాట ‘డం డేర్’ను ఈరోజు సాయన్బత్రం 5గంటలకు విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే , సిమ్రాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Related posts

కౌశల్ ను బైటకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్న బిన్ బాస్

jithu j

“నేను పంచదారలా ఉన్నాను, మీరు చీమల మాదిరిగా నా వెంట పడుతున్నారు” … మీడియాపై శృతి ఫైర్

jithu j

పాండవులు ఆయుధాలు జమ్మి పైనే ఎందుకు దాచారు?

chandra sekkhar

Leave a Comment