telugu navyamedia
సినిమా వార్తలు

యూవీ రిటైర్మెంట్… మాజీ ప్రేయసి కామెంట్స్

Kim-Sharma

భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఉత్తమ ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువరాజ్ సింగ్. అయితే సోమవారం నాడు ఆయన తన రిటైర్మెంట్ ప్రకటించగా… ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది సెలబ్రిటీలు పోస్ట్ ల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో అతడి మాజీ ప్రియురాలు కిమ్ శర్మ కూడా స్పందిస్తూ ”యూవీ అద్భుతంగా ఆడావు.. నీ ఆట, రికార్డులు మరువలేనివి. హేజల్ కీచ్ తో నీ మిగతా జీవితం కూడా ఇలానే విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. గతంలో యూవీ కిమ్ శర్మతో పాటు దీపిక పడుకొనే, ప్రీతీ జింతా వంటి హీరోయిన్లతో డేటింగ్ చేసినట్లుగా వార్తలు విన్పించాయి. యూవీ భార్య హేజల్ కీచ్ ఆయన రిటైర్మెంట్ పై స్పందిస్తూ “నీ భార్య అయినందుకు గర్వపడుతున్నా” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక రిటైర్ అవ్వడానికి ముందు యూవీ సచిన్ సలహా తీసుకోవడంతో పాటు తన సహచరులు జహీర్, భజ్జీ, వీరూలకు కూడా చెప్పానని, చాలా కాలం తరువాత తన తండ్రితో ఎక్కువసేపు మాట్లాడానని అన్నారు.

Related posts