telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కిమ్-ట్రంప్ చర్చలు విఫలం.. ఇక చర్చలు ఉండవంటున్న అమెరికా.. !!

kim and trump meet failed

నేడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల అధినేతల మధ్య జరిగిన సమావేశంలో అణు నిరాయుధీకరణపై ఒప్పందం కుదరలేదని సమాచారం. వియత్నాంలోని హనోయిలో వీరిద్దిరి భేటీ జరిగింది.

ఉత్తరకొరియాపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో రెండు దేశాల నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరి భేటీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఆల్ ఆఫ్ సడెన్ గా రద్దు చేయడంతో వీరిద్దరి మధ్య చర్చలు మళ్ళీ మొదటికే వచ్చినట్టే అర్థమవుతోంది. అమెరికా వైట్‌హౌజ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించేటట్లుగా ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేసింది. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, చర్చలు విఫలం అయినట్టుగా ప్రకటించారు. మరోదఫా చర్చలు జరగవని స్పష్టం చేశాడు. 

Related posts