telugu navyamedia
culture

చెప్పుతో సెల్ఫీ… ముచ్చట పడుతున్న స్టార్స్

Kids Selfie,Cheppal Photos Trending

పసి పిల్లలు దేవుడితో సమానం అంటారు పెద్దలు. వాళ్ళు ఏం చేసినా తల్లిదండ్రులకు, చూసేవాళ్ళకు ముద్దుముద్దుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి వాళ్ళు చేసే చేష్టలు నవ్వు తెప్పిస్తాయి. మరోవైపు చిన్నపిల్లలు చుట్టుపక్కల జరిగే అంశాలను పసిగట్టి… వారు కూడా అలాగే చేసే పనులు అబ్బురపరుస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఐదుగురు చిన్నారులు కలిసి ఆ ఫొటోలో చిరునవ్వులు చిందిస్తుండగా… వారిలో ఒక బాలుడు చెప్పుతో సెల్ఫీ తీస్తున్నాడు. 

 

ఈ ఫోటోను చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు వెంటనే ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తున్నారు. “మీరు ఎంచుకున్న దాన్ని బట్టే మీరు సంతోషంగా ఉంటారు” అని బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ సూపర్‌ స్టార్ అమితాబ్‌ బచ్చన్ మాత్రం “నేనిలా అంటున్నందుకు క్షమించండి. ఇది ఫొటోషాప్‌ చేసిన చిత్రమని నాకనిపిస్తుంది. స్లిప్పర్‌ పట్టుకున్న చేయి, మరో చేయికి తేడా ఉన్నట్లు అనిపిస్తుంది” అంటూ అమితాబ్‌ ట్వీట్ చేశారు.

Related posts

అమీర్‌పేట్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన బస్సు

vimala p

జ్వరాలు దరిచేరకూడదంటే ఇలా చేయండి

vimala p

స్వామీ వివేకానందుడి బోధనలు .. ఎప్పటికీ ఆదర్శప్రాయమే..

vimala p