telugu navyamedia
crime news Telangana trending

హైదరాబాద్ లో… చంటిబిడ్డను ప్రాణాలు బలిగొన్న.. జూ పార్క్…

kid died in hyderabad zoo park

హైదరాబాద్ లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు సంవత్సరాల బిడ్డ మృతిచెందింది. ఈ ఘటనకు పార్కులో సంచరించే ఓ బ్యాటరీ వాహనం కారణంగా తెలుస్తుంది. ఈ కారు ఢీకొనడంతోనే మొహమ్మద్ ఒమర్ సిద్ధిఖీ అహ్మద్ మృతి చెందాడు అంటూ ఆరోపణలు వచ్చాయి. తన తల్లిదండ్రులతో కలసి వచ్చి, సరదాగా ఆడుకుంటున్న బాలుడు, బ్యాటరీ కారు ముందుకు ఒక్కసారిగా వచ్చాడు. దాంతో ఆ కారు బాలుడిపై నుంచి వెళ్లిపోయింది.

వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించారు. వాస్తవానికి జూ నిబంధనల ప్రకారం, మధ్యాహ్నం 2.30 గంటల తరువాత బ్యాటరీ వాహనాలు తిరగకూడదు. కానీ సాయంత్రం 4 గంటల సమయంలో బ్యాటరీ కార్లు తిరగడంతో ఈ ప్రమాదం జరిగి, తమ బిడ్డ మరణించాడని అహ్మద్ తల్లిదండ్రులు ఆరోపిస్తూ నిరసనకు దిగారు.

Related posts

నష్టాలతో .. ముగిసిన మార్కెట్లు..

vimala p

షియోమీ .. స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఎ .. సిద్ధం.. !

vimala p

వ్యాయామం తరువాత .. ఈ నీరే తాగాలి..

vimala p