telugu navyamedia
సినిమా వార్తలు

ముద్దు సీన్లపై కియారా వ్యాఖ్యలు

Kiara Advani images

టాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన “అర్జున్ రెడ్డి” సినిమాను బాలీవుడ్‌లోకి “క‌బీర్ సింగ్‌” పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. “అర్జున్ రెడ్డి”కి దర్శకత్వం వహించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే “కబీర్ సింగ్”ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో షాహిద్ క‌పూర్‌, కియారా ఆడ్వాణీ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తెలుగు సినిమా త‌ర‌హాలోనే ఈ సినిమాలో కూడా లెక్కకు మించి ముద్దు సీన్లు ఉన్నాయ‌ట‌. ఈ సీన్ల షూటింగ్ గురించి తాజాగా కియారా స్పందిస్తూ “ఈ సినిమాలో చాలా ముద్దు సన్నివేశాలున్నాయి. వాటిని చాలా నార్మ‌ల్‌గా చేసేశాం. ఇత‌ర సీన్ల మాదిరిగానే వాటినీ చిత్రీక‌రించారు. షూటింగ్ స‌మ‌యంలో లిప్‌లాక్స్ సీన్లు చేసిన‌పుడు త‌ప్ప ఆ త‌ర్వాత వాటి గురించి ఆలోచించ‌నే లేదు” అని కియారా చెప్పుకొచ్చింది.

Related posts