telugu navyamedia
andhra business news news political Technology trending

రేపే విడుదల .. కియా కారు.. విడుదల చేయనున్న .. చంద్రబాబు..

kia first car will launch by apcm tomorrow

రాష్ట్రంలో కార్ల తయారీ సంస్థ ఏర్పాటు చేయడం, అది ఉత్పత్తి ప్రారంభించడం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ నుండి మొదటి కారు రేపు చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ తొలి కారు విడుదలకు సిద్ధంగా ఉంది. అతి తక్కువ కాలంలోనే పరిశ్రమను నిర్మించిన కియా సంస్థ… ఈ యూనిట్ లో తయారు చేసిన కారును విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది.

ఈ పరిశ్రమలో తయారైన తొలి కారు ట్రయల్ రన్ కూడా పూర్తైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తొలి కారును లాంచ్ చేయనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్ కారును మార్కెట్లోకి తెచ్చేలా కియా సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రేపు తొలి కారును చంద్రబాబు విడుదల చేయడమే కాకుండా… స్వయంగా నడపనున్నారు.

Related posts

సువ‌ర్ణ‌సుంద‌రి సుపర్ న్యాచ‌ర‌ల్ థ్రిల్ల‌ర్‌ – ఇంద్రా

vimala p

యూజర్‌ను ట్వీట్‌తో చంపేసిన తాప్సీ

ashok

వర్షం కురిసినప్పుడు ఐటీ ఉద్యోగులు..ఒకే సమయానికి బయటికి రావద్దు

vimala p