• Home
  • Ganesh Festival
  • ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణనాథుడు
Ganesh Festival సంప్రదాయ సామాజిక

ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణనాథుడు

108 Forms of Lord Ganesh

ఈనెల 13న వినాయక చవితి ఉండడంతో హైదరాబాద్ నగరంలో ఇప్పట్నుంచే సందడి మొదలైంది. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 57 అడుగుల ఎత్తుతో “శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా” భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. చవితి ఉత్సవాల కోసం ఖైరతాబాద్ భారీ గణనాథుడు కళాకారుల చేతిలో సుందరంగా, మనోహరంగా తుదిమెరుగులు దిద్దుకుంటున్నాడు. ప్రతియేడూ ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడు అశేష ప్రజానీకం పూజలను అందుకుంటాడు. వినాయక చవితి వచ్చిందంటే ఖైరతాబాద్ లో ఇసుకవేస్తే రాలేనంతమంది భక్త జనం గణనాథుడిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ వేడుకలకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు ప్రజల క్షేమం కోసం పటిష్ఠమైన భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఇక ఇప్పటికే తయారై జీవకళ ఉట్టిపడుతున్న భారీ విగ్రహాల వద్ద చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రజలు ఫోటోలు తీసుకుని మురిసిపోతున్నారు.

Related posts

అన్నపూర్ణాదేవి కన్నుమూత…

jithu j

చంద్రబాబంటే తనకెంతో ఇష్టం: రాందేవ్ బాబా

madhu

అలుపెరుగని యోధుడు!

chandra sekkhar

Leave a Comment