telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగు ఛానెల్ లో “కేజీఎఫ్” ప్రసారం… నిర్మాత ఫైర్

kgf

కన్నడ చిత్రం “కేజీఎఫ్” కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఆ సినిమా హీరో యశ్ కు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. హిందీలోనూ కేజీఎఫ్ కు ప్రేక్షకాదరణ లభించింది.అయితే ‘కెజిఎఫ్: చాప్టర్ 1’ తెలుగు శాటిలైట్ హక్కులను ఇప్పటి వరకు ఏ ఛానెల్‌కు విక్రయించలేదు. డిజిటల్ రైట్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోకు విక్రయించారు. ఒక లోకల్ తెలుగు ఛానెల్ ఇటీవల ‘కెజిఎఫ్’ను ప్రసారం చేసేసింది. అది ఎక్కడి ఛానెలో తెలీదు కానీ.. దీనిపై చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఛానెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఛానెల్‌లో ‘కె.జి.ఎఫ్’ ప్రసారమైనప్పుడు తీసిన ఫొటోను కూడా ట్వీట్‌లో పొందుపరిచారు. “ఎవెరీ అనే ఒక తెలుగు లోకల్ ఛానెల్ అన్యాయంగా కె.జి.ఎఫ్‌ను ప్రసారం చేస్తోంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. వారి చర్యలపై దావా వేస్తాం. శాటిలైట్ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయి, ఇంచుమించుగా ఫైనల్ అయిపోయాయి, ఇలాంటి సమయంలో కేబుల్ ఛానెల్ ఈ పని చేసింది. స్క్రీన్ షాట్స్, వీడియోలు వంటి ఆధారాలు మేం తీసి పెట్టుకున్నాం” అని కార్తీక్ గౌడ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం కేజీఎఫ్ కు సీక్వెల్ గా “కేజీఎఫ్ చాప్టర్-2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్​బాస్టర్​ విజయం సాధించడం వల్ల రెండో భాగంపై భారీ క్రేజ్​ నెలకొంది. ఈ క్రమంలో ‘కేజీఎఫ్​ ఛాప్టర్​ 2’కు సంబంధించిన డిజిటల్​ హక్కులను రూ.55 కోట్లతో అమెజాన్​ ప్రైమ్​ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

Related posts