telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

విడుదలైన కేజీఎఫ్ 2 టీజర్…

kgf

దేశంలోని సినీ ప్రేమికుల కళ్లన్నీ రానున్న పాన్ ఇండియా సినిమాల వైపే చూస్తున్నాయి. విలక్షణ కథాంశాంలతో అభిమానులను కలవరపెడుతున్నాయి. అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సినిమాల్లో కేజీఎఫ్2 కూడా ఒకటి. ఈ సినిమా కోలార్ గోల్డ ఫీల్డ్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదటి భాగం ఊహించనంతగా హిట్ కావడంతో రెండో చాప్టర్‌ ప్లాన్ చేశారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఒక్క సినిమాతోనే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మరియు హీరో యశ్‌ దేశవ్యాప్తంగా ప్రేక్షులకు పరిచయమయ్యారు. కాగా కేజీఎఫ్‌ భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర బృందం కేజీఎఫ్ చాప్టర్‌ 2ను ప్రారంభించింది. అయితే కేజీఎఫ్ చాప్టర్ -1 పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో దేశం మొత్తం కేజీఎఫ్-2 కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోంది. ఇక ఇటీవల ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేసి అభిమానుల మతి పోగొట్టారు. దీంతో దేశంలోని కేజీఎఫ్ అభిమానులు అతి త్వరగా ఈ సినిమా టీజర్,ట్రైలర్ విడుదల చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. అయితే రేపు జనవరి 8న యష్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేస్తారేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా చిత్రబృందం ఈరోజు రాత్రే కేజీఎఫ్ 2 టీజర్ విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే విడుదలైన టీజర్ తో ఈ సినిమా పై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది.

Related posts