telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రికార్డు ధరకు అమ్ముడైన “కేజీఎఫ్-2” రైట్స్

KGF-2

కన్నడ చిత్రం “కేజీఎఫ్” కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఆ సినిమా హీరో యశ్ కు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. హిందీలోనూ కేజీఎఫ్ కు ప్రేక్షకాదరణ లభించింది. ఈ నేపథ్యంలో, కేజీఎఫ్ కు సీక్వెల్ గా “కేజీఎఫ్ చాప్టర్-2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్​బాస్టర్​ విజయం సాధించడం వల్ల రెండో భాగంపై భారీ క్రేజ్​ నెలకొంది. ఈ క్రమంలో ‘కేజీఎఫ్​ ఛాప్టర్​ 2’కు సంబంధించిన డిజిటల్​ హక్కులను రూ.55 కోట్లతో అమెజాన్​ ప్రైమ్​ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ‘బాహుబలి సిరీస్ తర్వాత హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన‌ పాన్ ​ఇండియా చిత్రం ‘కేజీఎఫ్​. అందుకే అంత రేటు పెట్టి దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా ఆన్​లైన్​ హక్కులను అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది‌. ​ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం డిజిటల్​ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్​.. రెండో భాగాన్నీ ద‌క్కించుకోవ‌డం విశేషం.

Related posts