telugu navyamedia
సినిమా వార్తలు

“కేజిఎఫ్”లో నటించే అవకాశం…

KGF

కన్నడ క్రేజీ స్టార్ యష్ నటించిన “కేజిఎఫ్” సినిమాను ఇటీవలే కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విజయవంతమైంది. ఘ‌న‌ విజ‌యం సాధించిన ద‌క్షిణాది చిత్రం “కేజీయ‌ఫ్” క‌న్న‌డ స్టార్ హీరో యష్ ఈ సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. త్వ‌ర‌లో “కేజీఎఫ్‌” చాప్ట‌ర్‌-2 ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంద‌ని షూటింగ్ స‌మ‌యంలోనే నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చాప్ట‌ర్‌-2 షూటింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న‌వాళ్ల కోసం చిత్ర‌బృందం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నెల 26న బెంగ‌ళూరులోని జీఎమ్ రిజాయిజ్‌లో ఆడిష‌న్స్ జ‌రుగుతున్న‌ట్టు తెలిపింది. 8 నుంచి 16 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌లు, 25 సంవత్స‌రాల‌కు పైబ‌డిన పురుషులు కావాల‌ని ప్ర‌కటించింది. ఆడిష‌న్స్‌కు వ‌చ్చే ముందు ఒక నిమిషం నిడివి ఉన్న ఏదైనా డైలాగ్‌ను నేర్చుకుని రావాల‌ని సూచించింది.

Related posts