telugu navyamedia
క్రీడలు వార్తలు

రెండు జట్లు చెత్త బ్యాటింగ్ చేసాయి : పీటర్సన్

Kevin

ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ భారతదేశం మరియు ఇంగ్లాండ్ రెండు జట్ల బ్యాటింగ్ విధానాన్ని విమర్శించారు. ఈ జట్ల బ్యాటింగ్ ప్రదర్శనలు మెరుగ్గా ఉంటే పింక్-బాల్ టెస్ట్ 3వ రోజు లేదా 4 వ రోజుకు కూడా వెళ్ళేది అని అన్నారు. అయితే అహ్మదాబాద్‌లో జరిగిన పింక్-బాల్ టెస్ట్ 2 రోజుల్లో ముగిసిన తరువాత కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ…. 1935 తర్వాత మొదటిసారి ఇంత తక్కువ సమయంలో ఓ టెస్ట్ మ్యాచ్ పూర్తయింది. ఇక్కడ ఒక్కరు కూడా 150 కి పైగా స్కోరు చేయలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, ఇంగ్లాండ్ మొదట 112 పరుగులు రెండోసారి 81 పరుగులు చేసింది. ఇక భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 49 పరుగుల కాశ్యని వికెట్ కోల్పోకుండా చేధించారు. బ్యాటింగ్ రెండు జట్ల నుండి చాలా పేలవంగా ఉంది. వారు పేలవంగా బ్యాటింగ్ చేసినట్లు వారు అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. ఈ మ్యాచ్ లో మొత్తం 30 వికెట్లు పడగ అందులో 21 నేరుగా డెలివరీల నుండి వచ్చాయి. అయితే ఈ జట్లు మంచి బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ 3వ రోజు లేదా 4 వ రోజుకు వెళ్ళేది “అని పీటర్సన్ అన్నాడు.

Related posts