telugu navyamedia
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్బులో అక్షయ్ కుమార్ “కేసరి”

Kesari

అక్షయ్ కుమార్ హీరోగా, అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన “కేసరి” చిత్రం ఈనెల 21న విడుదలయ్యింది. ఈ సినిమా తొలి రోజునే 21 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి, ఈ ఏడాది తొలిరోజు అత్యధికంగా వసూళ్ళను రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. మొదటి మూడు రోజుల్లో సినిమా దాదాపు రూ.50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటె, ఆదివారం రోజున కేసరికి భారీ కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. మొదటి వీకెండ్ లో సినిమా దాదాపు రూ.78 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వంద కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

“కేసరి” కథ విషయానికొస్తే…1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. 21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ సినిమా స్టోరీ. ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “కేసరి” సినిమాలో అక్కీ “హవల్దార్ ఇషార్ సింగ్” పాత్రలో నటించాడు. “కేసరి” అంటే అర్థం త్యాగానికి గుర్తు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన పరిణీతి చోప్రా నటించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగిన సినిమాలు కూడా లేకపోవడంతో “కేసరి” తన హవాను మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

Related posts